ఇప్పుడు భారత్‌లో బయటపడిన కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచదేశాలను వణికిస్తోన్నాయి.. భారత్‌లో గుర్తించిన బి.1.617, బి.1.618 వేరియంట్లు.. చాలా దేశాలకు పాకింది.. సమస్యగా కూడా మారిపోయింది. అయితే భారత్ వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్‌కు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్, లాంగోన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షలో గుర్తించారు.. ఆ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల నమూనాలను సేకరించిన పరిశోధకులు.. భారత్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లతో కలిపి పరీక్షించి.. అవి సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ టీకాలు తీసుకున్నవారి శరీరంలోని యాంటీ బాడీలు కొత్త వేరియంట్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆ పరిశోధనలో తేల్చాయి.