దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితుల అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా, గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. దీనిపై టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… సీఎంగా ఉండి రైతులు, ప్రజలు పట్టించుకోకుండా కాలాయాపన చేస్తున్న కేసీఆర్.. మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఇప్పటికైనా మేల్కొని మీ పార్టీ సమస్యలను ప్రక్కకు పెట్టి ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కాలుతుంటే చుట్ట అంటించుకున్న చందా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునే పనులు మానుకోవాలని లేఖలో హితవుపలికిన కోమటిరెడ్డి.. రాష్ట్రంలో ఐకేపీ…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ రాగా.. మృతుల సంఖ్య భారీగానే ఉంది. ఈ సమయంలో.. బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి… వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్లు ఏమీ అక్కర లేదు.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలని ఆమె సెలవిచ్చారు.. అది కూడా దేశీ గోమూత్రం అయితేనే ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చారు.. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తాగుతానని.. అందుకే కరోనా…
కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో…
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే…
దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా మే 1 వ తేదీ నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డిసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. మే 1 వ తేదీన కొన్ని వ్యాక్సిన్లు రష్యా నుంచి ఇండియాకు దిగుమతి కాగా, నిన్నటి రోజున మరికొన్ని వ్యాక్సిన్లు దిగుమతి అయ్యాయి. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డ్రైవ్…
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు కర్ఫ్యూ, కరోనా కేసుల విషయంపై ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు కట్టడి కావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని, ప్రస్తుతం కర్ఫ్యూ అమలులోకి వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యిందని, కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడం మేలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. మే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో మొత్తం 18,29,26,460 మందికి వ్యాక్సిన్ అందించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి కరోనా సోకుతుండగా, మరికొందరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇలాంటి కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97.38శాతం…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది. అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది. ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు…