ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య.. 106కు పెరిగింది.. ఇదే సమయంలో 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా…
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే నమోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసి తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 71,070 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 25 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మొదటి విడత “వ్యాక్సిన్” తీసుకున్న తర్వాత “కరోనా” సోకినట్లయితే, “కరోనా” సోకిన నాటి నుంచి క్లినికల్ రికవరీ తర్వాత, 3 నెలల వరకు మలి విడత “వ్యాక్సిన్”వాయిదా వేయాలని తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో అసుపత్రులలో చికిత్స పొందిన “కరోనా” యేతర పేషెంట్లు కూడా, రికవరీ తర్వాత, 4 నుండి 8 వారాల పాటు టీకా తీసుకోవడం కోసం వేచి ఉండాలి. “కోవిడ్-19” సోకిన వ్యక్తి…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది. భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
కరోనా మహమ్మారి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఇక ఊపిరి తిత్తుల తరువాత దీని ప్రభావం కిడ్నీలపై అధికంగా కనిపిస్తోంది. కిడ్నీల జబ్బులతో బాధపడేవారు కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే కిడ్నీలు దెబ్బతింటాయని, ఫలితంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బారిన పడిన సమయంలో ఏవైనా చిన్న…
గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్ గురించి వచ్చే నెగిటివ్ వార్తలను…
కరోనాను చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండగా… వ్యాక్సినేషన్‌పై కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని స్పష్టం చేశారు.. ఆ సంస్థ చీఫ్ అదర్ పూనవల్లా. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని…
భారత్‌ను కరోనా సెకండ్ వేవ్ అల్ల కల్లోలం చేస్తోంది.. దాని దెబ్బకు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. మరికొన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అయితే, థర్డ్ వేవ్ ముప్పు కూడా లేకపోలేదని.. అది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన……
తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. ఇందులో 4,85,644 మంది కోలుకొని డిశ్చార్జ్…
దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్బీ పాటిల్…