తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతోన్న రికవరీ రేటు-కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి… రికవరీ రేటు పెరుగుతోందని ఆనందం వ్యక్తం చేసింది కేంద్రం… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్… పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. మే 3వ తేదీన రికవరీ రేటు 81.7 శాతం ఉందన్న ఆయన.. ఇప్పుడు అది 85.6 శాతానికి చేరిందన్నారు. ఇక, గత 24 గంటల్లో కోవిడ్నుం చి 4,22,436 మంది కోలుకున్నట్టు వెల్లడించారు లవ్ అగర్వాల్.. దేశంలో ఇంత భారీ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి అన్నారు.. దీంతో.. కరోనా రికవరీ కేసుల్లో పాజిటివ్ ట్రెండ్ మొదలైందని.. కొత్త కేసుల కంటే.. రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఇక, దేశంలో యాక్టివ్ కేసులు ఎలా ఉన్నాయన్నదానిపై వివరణ ఇచ్చిన ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి శుక్లా.. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, 10 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య.. 18 రాష్ట్రాల్లో 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. 199 జిల్లాల్లో కొత్త కేసుల తరుగుదల కనిపిస్తోందని.. గత 3 వారాల నుంచి పాజిటివ్ రేటు తగ్గుతూ వస్తుందన్నారు. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ వ్యాధి 1.8 శాతం మందికి వచ్చిందని, వైరస్ వ్యాప్తిని రెండు శాతం లోపు నియంత్రించినట్లు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!