ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు, నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే…
కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు.…
కరోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే రక్షణ మార్గం కావడంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్‌ను తయారు చేసిన దేశం రష్యా. స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సంబందించి ట్రయల్స్‌ను బయటకు ఇవ్వకపోవడంతో అనేక దేశాలు స్పుత్నక్ వీ ని ఆమోదించలేదు. Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా…
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. …
ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి…
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రతో పాటుగా అటు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక త్రిపురలో డెల్టాప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. Read: తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి…
కృష్ణా జిల్లా: ఏపీకిమరో 3.72 లక్షల కరోనా టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి..ఢిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 32 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చాయి టీకా డోసులు.. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు. read also : తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల…
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కరోనాపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. మణిపూర్, అసోంతో పాటు మిగతా రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం ఇప్పటికే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. గత వారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను పాటించేలా…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం కేసులు భారీగా నమోదు అవుతూ వచ్చాయి.. ప్రస్తుతం అక్కడ కూడా కేసులు తగ్గుతూ వస్తున్నాయి… కేరళ సర్కార్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో వంద మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. తాజా కేసులు కలుపుకొని పాజిటివ్ కేసుల సంఖ్య 30,73,134కు చేరుకోగా.. ఇప్పటి వరకు 14,686 మంది…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 858 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరుకోగా.. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకున్నారు.. ఇక, కోవిడ్…