కరోనాకు చెక్ పెట్టేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలు రెండు డోసుల వ్యాక్సిన్లు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. దీనిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు కూడా రావడంతో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందిస్తున్నారు.
Read: ‘ఎనిమీ’కి గుమ్మడి కాయ కొట్టేశారు!
ఇక ఇదిలా ఉంటే, ఈ వ్యాక్సిన్‌పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అరుదైన నాడీ వ్యాధులు వస్తున్నట్టు ఎఫ్‌డీఐ తెలిపింది. ఇప్పటి వరకు 100 మంది నుంచి ఈ విధమైన ఫిర్యాదులు అందినట్టు ఎఫ్‌డీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో నరాల్లోని కణాలు దెబ్బతింటున్నాయని, కండరాల బలహీనత ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఉందని ఎఫ్‌డీఐ తెలిపింది. దీనిని గుల్లెయిర్ బార్ సిండ్రోమ్ అంటారని, ఈ కేసులు 100 వరకు నమోదైనట్టు ఎఫ్‌డీఐ తెలిపింది. అమెరికన్ సీడీసీ వ్యాక్సిన్ ప్యానల్ మరోసారి ఈ వ్యాక్సిన్‌పై సమీక్షను నిర్వహించాలని ఎఫ్‌డీఐ సూచించింది. అయితే, ఎఫ్‌డీఐ చేసిన వ్యాఖ్యలపై జాన్సన్ అండ్ జాన్సన్ స్పందించాల్సి ఉంది.