తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 858 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరుకోగా.. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకున్నారు.. ఇక, కోవిడ్ మృతుల సంఖ్య 3,735కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,148 ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.. మరో 1,05,797 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 82 నమోదు అయ్యాయి.