కరోనా ఫస్ట్ వేవ్ కలవరపెడితే.. సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలు తీసింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైపోయింది.. భారత్‌లోనూ వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఇంకా, సెకండ్ వేవ్ ముప్పు పోలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజా పరిస్థితిలపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటోంది..…
కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు.. భారత్ తన జనాబాలో 60 నుంచి 70శాతానికి వ్యాక్సీన్ వేయడం అత్యవసరమని who స్పష్టం చేసింది. హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు .. ప్రపంచ ఆరోగ్యసంస్థ శుభవార్త అందించింది. ఇప్పటికీ WHO అనుమతుల కోసం వేచి చూస్తున్న కోవాగ్జిన్‌కు.. త్వరలోనే అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతులు మంజూరు చేయనుంది. read also :…
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,766 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716 కి చేరింది. read also : మరోసారి భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. ఇందులో 2,99,33,538 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,55,033 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి… మృతుల సంఖ్య 987కు చేరింది.. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 13 సాంపిల్స్ పరీక్షించగా.. 3,040 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 4,576 మంది పూర్తిస్థాయిలో…
కరోనా కారణంగా అనేక దేశాల్లో టూరిజం పూర్తిగా నష్టపోయింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నష్టపోయిన ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని దేశాలకు పర్యాటకరంగం నుంచి అధికమొత్తంలో ఆదాయం వస్తుంది. అలాంటి దేశాలు పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు త్వరితగిన చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ గ్రీన్ వీసా విధానాన్ని అమలులోకి తీసుకురాగా, ఈజిప్ట్ ఈ వీసాను అమలులోకి తీసుకొచ్చింది. ఈజిప్టుకు పర్యాటకం నుంచే అధికఆదాయం లభిస్తుంది. కరోనా కారణంగా…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా మరణాల కంటే, ఆకలి చావులే అధికంగా ఉన్నట్టు ఆక్సోఫామ్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఆక్సోఫామ్ సంస్థ పేదరిక నిర్మూలనకోసం పనిచేస్తున్నది. వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వివిధ దేశాల్లో అంతర్గత సమస్యలు, అంతర్గత ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. Read:…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. రోజుకు 40 లక్షల వరకు టీకాలు వేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ చివరినాటికి దేశంలోని 18 ఏళ్లు నిండిన వారందరికి వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ప్రతిరోజు 80 లక్షల వరకు టీకాలు అందించాలి. Read: ‘భాయ్ జాన్’పై…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పర్యాటక రంగం ఊపందుకుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా, విధిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్ తీయకూడదని ప్రభుత్వాలు మోరపెట్టుకుంటున్నాయి. అయినా, ప్రజలు షరామామూలుగా మారిపోయారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తిరిగి అదే నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు నిత్యం టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా…
కరోనా నేపథ్యంలో జపాన్ లో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. మూడో ఎమర్జెన్సీ జులై 11తో ముగియనున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ రాజధాని టోక్యోతో సహా ప్రధాన నరగాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. Read: ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి సభ్యుల నియామకం… మిగతా వేరియంట్ల కంటే డెల్టా…