కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 710 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 808 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,20,757కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,747కు చేరుకుంది.. గత 24…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నా.. పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్ పరీక్షించగా.. 2,526 మంది పాజిటివ్‌గా తేలింది… మరో 24 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తాజా మృతుల్లో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున,…
కేంద్ర తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపేర్కొన్నారు. దేశంలో ఇప్పటి విపత్కర పరిస్థితులకు ఎవరు కారణమో అందరికీ తెలుసునని అన్నారు. దశాబ్ధాలుగా నిర్మించిన వాటిని కొన్ని సెకన్ల వ్యవధిలో కూల్చివేశారని విమర్శలు చేశారు. ఎల్ఒసీ, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వివాదాలు, నిత్యవసర ధరల పెరుగుదల, రైతుల కష్టాలు, కరోనా వ్యాక్సిన్‌ల కొరత తదితర అంశాలకు కారణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే అని అన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ, దానిని ఒకచోట నుంచి మరోక చోటికి తరలించేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ ట్యాంకులు అంటే పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండే ట్యాంకర్లను వెంటబెట్టుకొని తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సెకండ్ వేవ్‌లో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శానిటైజర్ మాదిరిగా చిన్నగా ఉండే ఆక్సిజన్ బాటిల్‌ను రూపోందించారు…
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని…
కరోనాకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యూఎస్‌లో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశంలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా గట్టిగా చెబుతున్నది. ఒకవైపు వ్యాక్సిన్లు వేస్తూనే పెద్దమొత్తంలో మిగులు వ్యాక్సిన్లను నిల్వ చేసింది అమెరికా. దాదాపుగా 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను వివిధ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైన అమెరికా ఇప్పటికే 40 మిలియన్ వ్యాక్సిన్ డోసులను నేపాల్, భూటాన్,…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడి నుంచి.. ఎప్పుడు.. ఎలా.. ఎటాక్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి… జనారణ్యంలో ఉండే వారినే కాదు.. అభయారణ్యాల్లో సంచరించే అడవుల్లోని అన్నలను కూడా వదలడంలేదు.. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనాతో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటిస్తుండదా.. అందులో కొందరు కోవిడ్‌కు బలిఅయినట్టు.. మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా, మావోయిస్టు కీలక నేత వినోద్.. మహమ్మారి బారినపడి మృతిచెందారు.. ఎన్‌ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా…