తెలంగాణ కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.. ప్రస్తుం కరోనా పరిస్థితులు.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై స్పందించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. రాష్టంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని తెలిపారు.. పాజిటివ్ రేట్ చాలా వరకు తగ్గిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ గారు రెండు రోజుల క్రితం రివ్యూ చేయడం జరిగింది.. కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో నిన్నటి నుండి రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు తెలిపారు.. ఇక,…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 37,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కి చేరింది. ఇందులో 3,00,14,713 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,50,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 724 మంది మృతి చెందారు.…
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు. అయినప్పటికీ, కరోనా మహమ్మారి అదుపులోకి రావడంలేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి కొత్తగా వ్యాపిస్తున్నది. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. అయితే, బెల్జియంకు చెందిన…
కాళేశ్వరంలో మళ్ళీ కరోనా కలకలం రేపింది. గత కొన్ని రోజుల నుండి మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముందస్తుగా కాళేశ్వర గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం దేవస్థానంకు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 04 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 869 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,00,632 మంది సాంపిల్స్ పరీక్షించగా… కొత్తగా 704 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక,…
కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, ఈసారి మరిన్ని సడలింపులు కల్పించింది.. షాపులను రాత్రి 9 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతిచ్చిన సర్కార్.. రెస్టారెంట్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొంది.. ఇక, పుదుచ్చేరికి బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తమిళనాడులో తాజాగా 3039 కరోనా…