భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఇతర దేశాలు భారత్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఆ దేశం.. భారత్‌లో ఉన్నవాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు…
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కరోనా బారిన…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కుంభమేళా కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారిందనే విమర్శలు ఆదినుంచి వినిపిస్తున్నాయి.. దాని తగ్గట్టుగానే క్రమంగా పీఠాధిపతులు కన్నుమూయడం కలకలం రేపుతోంది.. తాజాగా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి కన్నుమూశారు.. అనారోగ్యంబారినపడి మూడు వారాల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయనకు .. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. మహంత్ లఖన్ గిరిని…
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ..…
భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్న పరీక్షా కేంద్రాలు నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా సేవలు అందించలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాధి నిర్థారణలో కీలకమైన కోవిడ్-19 ఆర్ టి పీసీయార్ (ఐసియంఆర్ వారి అనుమతులకనుగుణంగా) పరీక్షలకు వారికి అందించడానికై వీలుగా అపోలో…
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు మరో హీరో కరోనా బారిన పడ్డాడు. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అతికొద్ది లక్షణాలు కనిపించడంతో కళ్యాణ్ బుధవారం రోజున కరోనా టెస్ట్ చేయించుకున్నారట. అందులో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను అని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని,…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తోంది.. దేశవ్యాప్తంగా ఒకే రోజు నమోదైన కేసులు 3 లక్షలకు చేరువ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బంది కూడా ప్రాణాలువిడుస్తున్నారు.. ఇక, మహారాష్ట్ర, దాని రాజధాని ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా, ముంబైకి చెందిన ఓ మహిళా వైద్యురాలు.. ఫేస్‌బుక్‌లో ఇదే నా చివరి…
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలమే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గతంలో పాజిటివ్ కేసులు నమోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పది వేలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 సాంపిల్స్ పరీక్షిం చగా 9,716 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.. 24 గంటల్లోనే కోవిడ్‌తో 38 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్…