ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పది వేలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 సాంపిల్స్ పరీక్షిం చగా 9,716 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.. 24 గంటల్లోనే కోవిడ్‌తో 38 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారినపడి కృష్ణ లో పది మంది మృతిచెందగా.. నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు మరియు అనంతపురంలో ఒక్క రు మరణించారు.. ఇదే సమయంలో 3,359 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,86,703కు చేరగా.. యాక్టివ్ కేసులు 60,208గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 9,18,985 కరోనా నుంచి కోలుకోగా.. 7,510 మంది ప్రాణాలు కోల్పోయారు.