భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. సెకండ్ వేవ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.. ఇవాళ ఏకంగా 4 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది కరోనా రోజువారి కేసుల కౌంట్.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3523 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,99,988 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969కు చేరుకోగా.. రికవరీ కేసులు 1,56,84,406 కి పెరిగాయి.. ఇక ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 2,11,853 మంది మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,68,710గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,45,299 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 28,83,37,385కి చేరినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది