ఆ సినిమాలో దారుణంగా నటించా.. సమంత సంచలనం.. స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో…
Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది…
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన మండిపడ్డారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందని…
Minister Seethakka: ఆదిలాబాద్ జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు.
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి డూప్లికేట్ గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. “భారతదేశ రాజ్యాంగానికి అతీతులా? చట్టాలు వీరికి ఎందుకు వర్తించకూడదు?” అని సంబరపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకునేందుకు యంగ్ ఇండియా సంస్థ పేరుతో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో ఈ కుటుంబం మునిగిపోయిందని…
ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా? లేక భయపడ్డారా? అత్యంత కీలకమైన పార్టీ మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టారు? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనకు భయమెందుకు? ఒకవేళ అలిగితే రీజనేంటి? అధికారంలో ఉన్నాసరే… అంత యాక్టివ్‌గాలేని కాంగ్రెస్ శ్రేణుల్ని రీ ఛార్జ్ చేసే పని మొదలుపెట్టారట తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌తో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారామె. ఈ సందర్భంలోనే… పలు లోటుపాట్లు బయటపడుతున్నట్టు…
రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు.…