Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ "మొసాద్" ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్‌బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్‌తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్,…
Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు.
పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
Congress: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లో టూరిస్టుల్ని టార్గెట్ చేస్తూ, ఉగ్రవాదులు దారణమైన దాడికి పాల్పడ్డారు. పక్కా పథకంలో వచ్చిన టెర్రరిస్టులు, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 27 మంది మరణించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.
వాళ్ళు చర్చిస్తారు… నిర్ణయిస్తారు.. నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. బస్… అక్కడితో మేటర్ ఖతం. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉండదా? లేదా మనం మీటింగ్‌లు పెట్టి బిస్కెట్ తిని ఛాయ్తాగి వెళ్ళిపోతే… నిర్ణయాలు వాటంతట అవే అమలైపోతాయని ఫీలవుతారా? ఏకంగా పార్టీ చెప్పిన మాటకు కూడా దిక్కులేదా? ఇక్కడ ఓన్లీ టెలింగ్స్..!? నో ఇంప్లిమెంటేషన్సా? అంతా… తలపండిన నేతలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. వ్యూహరచనలు, ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కూడా అందరూ…
Assam: అస్సాంలో పంచాయతీ ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ‘‘లుంగీ vs గాడ్సే రివాల్వర్’’ పంచాయతీ నడుస్తోంది. కాంగ్రెస్ ధోతీలను పంపిణీ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన గుర్తుకు బదులుగా, లుంగీని ఎంచుకోవాలని అన్నారు. అయితే, దీనికి కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ ‘‘గాడ్సే రివాల్వర్’’ని ఎంచుకోవాలని సూచించింది. నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేయడాన్ని…
బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Minister Ponguleti: యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ప్రజలకు భారంగా మారింది అందుకే భూ భారతి తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఇక, నలుగురు వ్యక్తులు చేసిన చట్టమే ధరణి.. ధరణి పోర్టల్ అమలు చేసే సమయంలో వంద రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆరోపించారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.