తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “పండగ వాతావరణంలో భూ…
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని…
రాజస్థాన్ పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి వింత పరిస్థితి ఎదురైంది. సవాయి మాధోపూర్‌లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనానికి రాహుల్‌గాంధీ వెళ్తుండగా సడన్‌గా కారు ఆపి.. కాంగ్రెస్ కార్యకర్త చుట్టన్ లాల్ మీనాను పలకరించారు.
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగింది. గ్రూప్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు.. పరీక్ష రాసింది 21,093అయితే ..ఫలితాలు 21,103 మందికి ఇచ్చారు.. పరీక్ష రాయకుండానే…
PM Modi: హర్యానా హిస్సార్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్‌ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.
Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Bhu Bharati Portal: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి (ఏప్రిల్ 14న) నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీకి చెందిన డానిష్ ఇక్బాల్ కన్హయ్య కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఆదివారం అతడిపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.