Off The Record: ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద సొంత నేతలే భగ్గుమంటుంటే.. ప్రతిపక్షం మాత్రం శాంతి మంత్రం జపిస్తోందట. పైగా… ఆయన్ని పల్లెత్తు మాట అనవద్దని కింది స్థాయికి సంకేతాలు పంపిందట. సొంతోళ్ళతో తలనొప్పులు పడుతున్న ఆ శాసనసభ్యుడు ప్రత్యర్థి పార్టీకి ఎలా ప్రీతిపాత్రుడయ్యారు? ఎవరాయన? ఏంటా రివర్స్ పొలిటికల్ ప్రేమ్ కహానీ?
Read Also: Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీకి వేల కోట్లలో వ్యాపారాలు.. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా..
పటాన్‌చెరు నియోజకవర్గం. గత మూడు విడతల నుంచి గులాబీ జెండా ఎగిరిన సెగ్మెంట్. ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు గూడెం మహిపాల్‌రెడ్డి. తొలి రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా… మూడోసారి అంటే… 2023లో అధికారం పోవడంతో… కారు దిగేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మహిపాల్‌రెడ్డి. నిరుడు జులై 15న కాంగ్రెస్ గూటికి చేరారాయన. ఆ క్రమంలోనే…లోకల్ కేడర్‌కి భరోసా ఇచ్చింది బీఆర్‌ఎస్ అధిష్టానం. ఎమ్మెల్యేతో పాటు ఆయన ముఖ్య అనుచరగణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా… కరుడుగట్టిన గులాబీ కార్యకర్తలు మాత్రం పార్టీ మారలేదు. అయితే…ఎమ్మెల్యే వెళ్ళిపోయాక నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కి పెద్దదిక్కు లేకుండాపోయింది. దీంతో కో ఆర్డినేటర్ పోస్టు కోసం ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొందరు పోటీపడ్డారు. ఎట్టకేలకు రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆదర్శ్ రెడ్డిని కో ఆర్డినేటర్‌గా నియమించారు అధినేత కేసీఆర్. ఆయనను కో ఆర్డినేటర్‌గా కొందరు స్వాగతిస్తే… ఆ పోస్టుపై ఆశపడ్డ మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు.
Read Also: Suryakumar Yadav: టీ20 మొనగాడు.. ముంబై ఇండియన్స్ కి నేనున్నాను..
ఇక, ఇదంతా బయటికి కనిపిస్తున్న వ్యవహారం. కానీ ఇంటర్నల్ రాజకీయాలు మాత్రం వేరే లెవల్‌లో ఉన్నాయట. పార్టీ మారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై లోకల్ క్యాడర్, లీడర్లు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కష్టపడి గెలిపిస్తే పార్టీకి అధికారంపోగానే వదిలేయడం ఏంటని ఫైర్ అవుతున్నట్టు సమాచారం. మరోసారి ఇటువైపు చూడు… నీ సంగతి చెప్తాం అన్న రేంజ్‌లో హార్డ్‌కోర్ బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారట. అయితే… విషయం తెలుసుకున్న గులాబీ అధిష్టానం ఆ ఫైర్ మీద నీళ్ళు చల్లినట్టు సమాచారం. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ… పార్టీ నేతలు ఎవరితోను సఖ్యతగా ఉండటం లేదు. పైగా ఇటీవల సుప్రీం కోర్ట్‌లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదని వివరణ ఇచ్చుకున్నారట. అంతకు ముందు నియోజకవర్గంలోని తన ఆఫీస్‌లో కేసీఆర్ ఫోటో తీసేదిలేదని నేరుగానే చెప్పేశారు. ఈ పరిణామ క్రమంలో.. మహిపాల్ రెడ్డి చూపు మళ్లీ బీఆర్ఎస్ వైపు మళ్ళిందన్న సంకేతాలు ఆ పార్టీ హైకమాండ్‌కి అందినట్టు తెలిసింది. అందుకే ఆయన్న పల్లెత్తు మాట కూడా అనొద్దని లోకల్ లీడర్లకు హైకమాండ్ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అవసరమైతే.. ప్రభుత్వంపై విమర్శలు చేయండి గానీ.. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనకండి అంటూ పార్టీ పెద్దలు చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
Read Also: IPL 2025: వాళ్లు ఐపీఎల్ అంపైర్స్ కాదు.. ముంబై అంపైర్స్!
అయితే, అధిష్టానం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. కొందరు సరే అంటే మరికొందరు సారీ అంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా ఎన్నికైన తర్వాత ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఆ యాత్ర ముగింపు సభకి మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఆయన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడుతారని అంతా అనుకుంటే ఆయన మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరాశకు గురయ్యారట నియోజకవర్గ నాయకులు. ఇతర నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు లోకల్ బీఆర్ఎస్ క్యాడర్ తలనొప్పులు తెప్పిస్తుంటే… ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేకు పూలపానుపు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కొందరు. రాజకీయ సమీకరణాలు ఇలానే కొనసాగితే మా పార్టీ బీఆర్ఎస్సే కానీ…. అంటూ సణుగుతున్నట్టు సమాచారం. మహిపాల్‌రెడ్డి మీద బీఆర్‌ఎస్ అధిష్టానం సాఫ్ట్ కార్నర్ పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు నియోజకవర్గంలోని పొలిటికల్ పరిశీలకులు.