Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన “స్పష్టమైన ఆధారాలు” తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన పాకిస్తాన్‌లో 15 రోజుల పాటు ఎందుకు బస చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, మీ పర్యటన యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయగలరని కోరారు. లేదంటే, వచ్చే సెప్టెంబర్ కంటే ముందే ఆ పూర్తి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడిస్తానని అస్సాం సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు.
Read Also: Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్.. ఎందుకో తెలుసా?
ఇక, గౌరవ్ గోగోయ్ భార్యకు పాకిస్థాన్ దేశంలోని ఒక NGO నుంచి జీతం వస్తుందని అస్సాం సీఎం హిమాంత శర్మ పేర్కొన్నారు. భారతదేశంలో నిర్వహించే కార్యకలాపాలకు పాకిస్తాన్‌కు చెందిన ఆ సంస్థ ఎందుకు జీతం చెల్లిస్తోందని ప్రశ్నించారు. అలాగే, హస్తం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడి ఇద్దరు పిల్లలు ఇకపై భారత పౌరులు కారని సీఎం హిమంత బిస్వా శర్మ తేల్చి చెప్పారు.
Read Also: Jagga Reddy: కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు..
అయితే, ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ రెండు ప్రశ్నలను సంధించారు. కాగా, 1) నేను, నా భార్య శత్రు దేశ ఏజెంట్లు అనే మీ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైతే మీరు సీఎం పదవీకి రాజీనామా చేస్తారా..? 2) నేను కూడా మీ పిల్లలు, భార్యపై ప్రశ్నలు అడిగితే సరైన ఆధారాలతో సమాధానం చెప్తారా..? అని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇక, మీ సొంత (బీజేపీ) పార్టీలో కేంద్రమంత్రులు ఎస్. జైశంకర్ ఇద్దరు పిల్లల గురించా?, లేదా పియూష్ గోయల్ పిల్లలా?.. లేక హర్దీప్ సింగ్ పూరి పిల్లలా? గురించా లేదంటే ఎంపీ సుధా మూర్తి పిల్లలు కూడా ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీలోని వ్యక్తులపై ఇంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు తమ సొంత పార్టీలోని వారి గురించి కూడా తెలుసుకోవాలని అస్సాం సీఎం హిమంత శర్మకు సూచించారు.