తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో రేవంత్‌కు సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎవరి గోల వారిదేనా? రాహుల్‌ను విమర్శించినా పార్టీ నేతల నుంచి స్పందన లేదా? నేతల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసిందా? రేవంత్ వర్గం తప్ప ఇంకెవరూ మాట్లాడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మీదకు రావాలంటే బ్రహ్మాండం బద్ధలవ్వాలనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా.. ఆయనతో తమకు పడకపోయినా.. సోనియా, రాహుల్ గాంధీలను…
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరుగుతున్న కొన్న ఘటనలపై స్పందించిన జగ్గారెడ్డి… పార్టీ బాగు కోసమే నేను మాట్లాడుతున్న.. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదన్నారు.. అందరినీ కలుపుకుని పోవాలని సూచించిన ఆయన.. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను మాట్లాడేది తప్పు అయితే.. రేవంత్‌రెడ్డి చేసేది కూడా తప్పే అంటున్నారు జగ్గారెడ్డి. ప్రతీ సభలో ఎవ్వరినీ ఆయన…
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
అసెంబ్లీని కేవలం ఐదు రోజుల పాటే నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్న ఆయన.. మజ్లీస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఏసీకి బీజేపీని ఆహ్వానించడంలేదన్నారు.. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఆయన.. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం.. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదన్నారు.. మొదటి ప్రభుత్వంలో…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ వారికి సంతాపం తెలిపింది. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ హోదాలో భూపాల్ రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు ఆర్డినెన్సులను…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా, సభలో స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభను వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, తప్పనిసరిగా 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ…
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా 9 మంది మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే BAC సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సెషన్స్ వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… నెల రోజుల పాటు నిర్వహించాలని…
తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? లెఫ్ట్‌తో చెట్టపట్టాల్ చెబుతున్నదేంటి? ఉద్యమాలకే పరిమితమా.. లేక ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందా? ఎన్నికల వరకు కలిసి వెళ్తారా? తెలంగాణలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కాబోతుందా? ఉద్యమాల్లో కలిసి పనిచేసే కామ్రేడ్లే.. ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేక పోతున్నారు. అలాంటి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా? కేవలం ఉద్యమాల వరకే కలిసి సాగుతుందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న తాజా చర్చ ఇదే.…
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. వస్తే గిస్తే మళ్లీ సార్వత్రిక ఎన్నికలే. ఇలాంటి సమయంలోనే టీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాటి నుంచి అక్కడ ఎన్నికల హీట్ మొదలైంది. ఈ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్యంగా కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా…
కళ్ళు, చెవులు ఉన్న వారికి మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు తెలుస్తాయి. నిన్న ఇందిరా పార్కు దగ్గర విపక్ష నేతలు ఇష్టం వచ్చి నట్టు మాట్లాడారు, అవాకులు చవాకులు మాట్లాడారు అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సొంత పార్టీ లోనే కుంపట్లు ఉన్నారు. తెలుగు దేశం కాంగ్రెస్ గా మార్చారు అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. స్క్రిప్టు రైటర్ ల ను పెట్టుకొని తాత్కాలిక ఆనందం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ……