కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో నెలకొన్న సంక్షోభంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యింది.. అయితే, రాజీనామా చేసినప్పట్టి నుంచి మౌనంగా ఉన్న కెప్టెన్.. ఇవాళ ఒక్కసారిగా.. రాష్ట్ర నేతల నుంచి అధిష్టానం వరకు ఎవ్వరినీ వదిలేదు లేదన్నట్టుగా ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతలైనా…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను వారానికి పైగా నిర్వహించాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు సమాచారం. బీఏపీ సమావేశంలో చర్చించి… ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న మొదలై.. 26న ముగిశాయి. ఇక, అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దళితబంధు పథకం కోసం కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి…ఆమోదించుకోవాలని భావిస్తోంది.…
మాకు అది చెప్పలేదు.. ఇది చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్‌కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది. గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రు కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్…
రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. మరికొందరు నెమ్మదిగా వెళుతుంటారు. ఏదిఏమైనా అల్టిమేట్ గా వాళ్ల గోల్ మాత్రం అందలం ఎక్కి ప్రజాసేవ చేయడమే. సరైన వ్యూహాలతో ముందుకెళితే రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ ఉంటుంది. లేనట్లయితే అనతికాలంలోనే కనుమరుగు కావాల్సి ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారాలంటే చాలా ఆలోచించే వాళ్లు. ఇప్పుడైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంపింగ్ లు కామన్ అయిపోయింది. దీన్ని ప్రజలు లైట్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు.. కాళేశ్వరం ఫలితాలను సంజయ్ చూస్తున్నారని.. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పడం లేదన్న ఆయన.. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నామని బండి సంజయ్ కి ప్రజలే చెబుతున్నారని.. ఇకనైనా కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలని…
త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్,…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు… రేవంత్‌రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది… పరువు నష్టం కేసులో ఇంజెక్షన్ ఆర్డర్‌పై వాదనలు ముగిశాయి.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కేటీఆర్.. అయితే, మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది కోర్టు.. కాగా, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పరువునష్టం దావా వేశారు.. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ పూర్తి అయ్యింది.. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులతో మంత్రి కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని.. అలాగే డ్రగ్స్‌కు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ…
కేసీఆర్ పాలనలో ప్రమాదంలో ఉంది. రాష్ట్రం మాదకద్రవ్యాల మయం అయ్యింది. వైట్ ఛాలెంజ్ కు స్పందించని కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ పారిపోయాడు. పరువునష్టం దావా తో కేటీఆర్ పరువు పోయింది అని తెలిపారు. గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణ సరిగ్గా జరగదు. డ్రగ్స్ కేసులో కొదరు…
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు.. కూరగాయల మార్కెట్ నుండి ఎంఆర్వో కార్యాలయం వరకు పాదయాత్రగా.. భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సీతక్క.. అయితే, దండోరయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.. ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో కళ్లు తిరిగి పడిపోయారు సీతక్క.. దీంతో.. వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కార్యకర్తలు.. సీతక్క ప్రస్తుతం ఆస్పత్రిలో…