హుజూరాబాద్ బై పోల్ ఫీవర్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్షన్ డిలే అయినా పార్టీల ప్రచార హోరు ఆగలేదు. పైగా జోరు పెరిగింది. గల్లీ గల్లీలో నేతలు సందడి చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. చాలా రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.. ప్రచారంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఓపెన్ సీక్రెట్. నూటికి 99 శాతం ఈటలే. ఆ ఒక్క శాతం తేడా వస్తే ఆయన భార్య…
తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంట్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సవాల్ విసిరితే.. ఆ సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు,…
ప్రధానమంత్రి మోడీ భేటీ బచావో, భేటీ పడవో పిలుపు ఇచ్చారు. కానీ దేశంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది అని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. సింగరేణి కాలనీలో ఒక 6 ఏళ్ల గిరిజన అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. మొన్నటిమొన్న మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ చేశారు. వీరిద్దరి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చారు.. ఆ కుటుంబాలను ఆడుకోవడం ప్రభుత్వ బాధ్యత. కానీ హజీపూర్ లో జరిగిన మూడు బలహీన వర్గాలు…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరించకుండా…. మంత్రి కేటీఆర్ పారిపోయాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డీ ఛాలెంజ్ లో ముందుకు వచ్చారని.. కానీ కేటీఆర్ మాత్రం రాలేదన్నారు. విశ్వనియత నిరూపించుకోవాలి అంటే… కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కి రావాల్సిందేనని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. 14 యేండ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అకున్ సబర్వాల్ నివేదిక చెప్పిందని…గుర్తు చేశారు.…
పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్‌కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్‌గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి…
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత కలహాల కారణంగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన పీసీపీ అధ్యక్షుడు సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధూను వెనకేసుకు వచ్చింది. రాష్ట్రంలో సిద్ధూకు మంచి పాపులారిటి ఉందని, ముందుండి నడిపించే సత్తా ఉన్న నాయకుడు సిద్ధూ అని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలకు…
పంజాబ్ కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవాను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తరువాత సిద్ధూపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సిద్దూకి, పాక్ పీఎం, ఆర్మీ చీఫ్‌కి మద్య మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అనే భయం కలుగుతుందని, సిద్ధూ సీఎంగా ఎంపికైతే పంజాబ్‌లోకి పాక్ ఆయుధాలు వస్తాయని తద్వారా దేశంలో కలహాలు రేగే అవకాశం ఉందని అమరీందర్ సింగ్…
బీజేపీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందా? అంటే అంత అవుననే సమాధానం విన్పిస్తోంది. నిన్నటి వరకు బీజేపీ అధిష్టానం వరుసబెట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చివేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో బీజేపీ తరహా ఫార్మూలానే ఫాలో అవుతోంది. అక్కడి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వేటు వేసింది.…
పంజాబ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ ఎవరు అధికారం చేపడతారు అన్నతి ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన తరువాత అమరీందర్ సింగ్ డైరెక్ట్‌గా సిద్ధూను విమర్శించారు. పాక్ కు పంజాబ్ ఆయుధంగా మారొచ్చని చెప్పడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక పంజాబ్ రాజకీయాలపై యూపీఏ కూటమిలోని పార్టీలు పలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి…
పంజాబ్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూ నిలకడ లేని మనిషి అని, పాక్ సీఎం, ఆర్మీ చీఫ్‌తో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయని, వారంతా స్నేహితులని అన్నారు.…