అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ…
32శాతం దలితులు ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత రాహుల్, సోనియా గాంధీ లదే అని భట్టి విక్రమార్క అన్నారు. దళిత సీఎం ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే అమరేందర్ సింగ్ ను బీజేపీ నేతలు ఢిల్లీ కి పిలుపించుకున్నారు.. దళిత తుడికి సీఎం ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలి… కానీ పంజాబ్ లో రాజకీయ సంక్షోభం వచ్చినట్లు గా చూపెట్టడం సరైంది కాదు. దీన్ని నేను ఖండిస్తున్నా అని…
పంజాబ్‌లో మరో కొత్త పార్టీ ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్న అమరీందర్ సింగ్, ఢిల్లీలో బిజీగా మారిపోయారు. ఈరోజు కేంద్రంలోని అనేక మంత్రులను, ప్రధాని మోడిని కూడా కలిశారు అమరీందర్ సింగ్. కాగా, ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండబోవడం…
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి…
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు ఆ పార్టీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ బాధ్యతను తన మేనల్లుడికి అప్పగించారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. గోవాపై కూడా టీఎంసీ దృష్టిసారించింది.. ఇవాళ గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత లూజినో ఫలీరో.. టీఎంసీ గూటికి చేరారు.. కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక…
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు కామెంట్లు చేయడం.. దానికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడం.. మధ్యలో పోసాని మురళి ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇటు సినిమా పరిశ్రమలో కొంత టెన్షన్ నెలకొంటే.. పొలిటికల్ కామెంట్లు మాత్రం ఓ రేంజ్లో పేలుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్.. మంత్రిని.. ఆ మంత్రి తిరిగి పవన్‌ని దూషించడం అంతా ఒక గేమ్ అని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అయితే ఆపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్…
పంజాబ్ పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన తరువాత పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్ధూ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మంత్రులు కోరినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాటం చేస్తానని సిద్ధూ పేర్కొన్నారు. అవినీతి మరకలు అంటిన వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదని, సిద్ధాంతాల కోసం జరుగుతున్న యుద్ధం అని, అవినీతి మరకలు…
సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడం పట్ల పలువురు నేతలు ఆయన్ను విమర్శించడం మొదలుపెట్టారు. సిద్ధూపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూకి స్థిరత్వం లేదని, అనాడు ఇంగ్లాండ్‌లో భారత జట్టును వదిలేసి వచ్చినట్టుగానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మధ్యలో వదిలేసి ఆ పార్టీని నిండా ముంచేశాడని అన్నారు.…
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగా సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. దీంతో పంజాబ్‌లో సంక్షోభానికి తెరపడినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే, సడెన్‌గా పంజాబ్ పీసీసీకి సిద్ధూ రాజీనామా చేశారు. ఆయనకు మద్ధతుగా ఓ మంత్రి, ఓ నేత…