కేంద్ర రైతు చట్టాలకు వెతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారు. రైతులను నాశనం చేసినవాళ్ళు… రాజకీయ ఎదిగిన వాళ్ళు లేరు చరిత్రలో లేరు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి రోజు శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల. పైకి కేంద్రమంత్రి కొడుకు అధికార దాహంతో నాలుగు రైతులను తిక్కి చంపారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోమ్ అమిత్షా ఉన్నారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైంది. చనిపోయిన రైతుల కుటుంబాల పక్షాన దేశంత నిలబడాల్సిన అవసరం ఉంది. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ సర్కార్ కర్కశంగా అరెస్టు చేశారు. అజయ్ మిశ్రా ను మంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలి. అజయ్ మిశ్రా కొడుకుతోపాటు బీజేపీ నాయకుల పై హత్య కేసు నమోదు చేసి శిక్షించాలి అని డిమాండ్ చేసారు. శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల పై మోడీ, అమిత్షా లు మరణ శశనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలి అని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి చేత ఈ ఘటన పై విచారణ జరిపించాలి అని పేర్కొన్నారు.