ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు. చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు, కన్హయ్య కుమార్‌కు…
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ…
తెలంగాణలో ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అంతేకాదు.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని పోలీసులకు కోరారు. దీనిక పోలీసులు అనుమతించలేదు. నేతలు వాగ్వాదానికి దిగడంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భట్టిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు. గుర్రాలపై అసెంబ్లీ లోనికి వెళ్తామని పట్టుబట్టారు ఎమ్మెల్యేలు. దీంతో…
దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారత్ బంద్ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని, అందుకే ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని…
వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.…
అసలే పార్టీ కష్టాల్లో ఉంది..నేతలంతా సపోర్ట్ గా ఉండాలి.. లోటు పాట్లు సర్దుకుపోవాలి..కానీ, ఇక్కడ జరుగుతున్నది రివర్స్..ఎటూ కఠిన చర్యలు తీసుకోలేరని అలుసుగా భావిస్తున్నారా? టీ కాంగ్రెస్ నేతల దూకుడుకు కారణాలేంటి? కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. అయితే…తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ రేవంత్ వచ్చిన తర్వాత… క్రమశిక్షణకి ప్రాధాన్యత అనే ఇండికేషన్ పంపించారు. దీంట్లో భాగంగానే… గాంధీ భవన్ లో పాస్ ల కోసం గొడవ పడ్డ ఇద్దరిలో ఒకరిని పార్టీ నుండి బయటకు…
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేసారు. బండి సంజయ్ ది విహారాయత్రనో ఏం యాత్రనో తెలువది అని చూపిన ఆయన దానికి అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలి అన్నారు. ఇక నేను ఎమ్మెల్యే గా…
ఇక్కడ భూమి ఒక్కరిది, రైతు బంధు ఒక్కరిది. భూ సమస్యల పరిష్కారం ఏమో కాని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తలేదు. అర్హులకు పథకాలు అందడం లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ధరణి అనేదే సమస్యల పుట్ట అని చెప్పిన సీతక్క భూస్వాములకు ధరణిలో సమస్యలు లేవు. కొద్దీ మొత్తం భూమి ఉన్న రైతులకే ఈ సమస్యలు. వాళ్ళకి కావాల్సినవి సీక్రెట్ గా చేస్తరు. రైతులకు ఎంలేదు. దళిత బంధు…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. అయితే, ఈ ఎపిసోడ్ ఇవాళ్టితో ముగిసిపోయిందని.. మళ్లీ రిపీట్ కాదని ప్రకటించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో సమావేశమైన వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి.. నిన్నటి వ్యవహారంపై కార్యదర్శులు ఆయనతో మాట్లాడారు.. తను వ్యాఖ్యలు చేయడానికి కారణాలను పార్టీ నేతలకు ఏకరువు పెట్టారు.. ఇక, అనంతరం మీడియాతో…