నోటు అనగానే మరకు దానిపై మహాత్మగాంధీ బొమ్మ గుర్తుకు వస్తుంది. గాంధీ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లుబాటు కాదు. అయితే, ఇప్పుడు ఆ గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రూ.2000, రూ.500 నోట్లను అవినీతితో పాటుగా బార్లలోనూ వినియోగిస్తున్నారని, అలా ఉపయోగించే వాటిపై గాంధీ మహాత్ముడి బొమ్మ ఉండడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అవినీతి కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహాత్మాగాంధీ జయంతి రోజున ఆయన ప్రధానికి లేఖ రాశారు. చిన్న నోట్లపై గాంధీ బొమ్మ ఉంచడంలో తప్పు లేదని, వాటిని ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు వినియోగిస్తారని, అక్కడ అవినీతి జరగదని, పెద్ద నోట్లతో పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తి చేశారు.
Read: తిరుగులేని ముఖేష్ అంబానీ… వరసగా 14వసారి…