పంజాబ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ఆప్ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉండటంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఎలాగైనా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచిత విద్యుత్ హామీని ప్రకటించింది. ఢిల్లీలో సమర్థవంతంగా ఈ హామీ అమలవుతున్నప్పుడు పంజాబ్‌లో ఎందుకు ఉచిత విద్యుత్ హామీ అమలుకాదని ఆప్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పంజాబ్ ముఖ్యమంత్రి చన్ని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దగ్గర 5 వేలు ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రావాల్ కు ఇవ్వాలని, ఆయన ఆ డబ్బుతో మంచి బట్టలు కుట్టించుకుంటారని అన్నారు. ఆయన జీతం రూ.2.5 లక్షలు అని, మంచి బట్టలు కుట్టించుకోలేరా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ రిప్లై ఇచ్చారు. చన్నీకి తన దుస్తులు నచ్చకపోయినా, ప్రజలకు నచ్చుతాయని, ఆ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఉద్యోగికీ ఉపాది, రైతుల రుణాలు మాఫీ, మతం పేరుతో అల్లర్లకు పాల్పడే వారిని జైలుకు పంపడం, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం వంటివి ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
Read: ఆ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత… మార్గదర్శకాలు ఇవే…