Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు.
Deputy CM Bhatti: గత ప్రభుత్వం హయాంలో రైతులు వాడిన విద్యుత్ కు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిన వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించి.. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి.. 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయని తేల్చి చెప్పారు.
ఇక, సౌర శక్తి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మహిళా సంఘాలకు ఇవ్వడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో తీసుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం ఎందుకు ఇస్తున్నారు అని విమర్శిస్తున్నారు.
V. Hanumantha Rao: కుల గణనపై ఎవరు మాట్లాడనప్పుడే రాహుల్ గాంధీ మాట్లాడారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేర్కొన్నారు. ఎవరు ఎంతో, వారికి అంత అని చెప్పారు.. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మూడు సార్లు కలిసి బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వు అని కోరినా ఇవ్వలేదు.
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఈ రోజు 1,551.89 కోట్ల రూపాయలను విడుదల అయ్యాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్…
మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా నడిచిన సెగ్మెంట్. కానీ... గత మూడు విడతల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ సమీకరణలు మారిపోయాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు.
మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో ముసలం మొదలైందంటున్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినా.... ఆయన మాత్రం నియోజక వర్గానికే పరిమితం కావడంతో ప్రోటోకాల్ సమస్యతో పాటు వర్గపోరు ముదిరి పాకాన పడిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన చోటల్లా అప్పులు చేశాడని ఆరోపించారు. అందినకాడల్లా ఎగబెట్టి పోయాడు అని మండిపడ్డారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.