Election Commission: గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అయితే, పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని.. కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు సంబంధించి 45 రోజుల సీసీ ఫుటేజీను బహిర్గతం చేయాలని కోరాయి. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏకీకృత, డిజిటల్ ఓటరు జాబితాలను రిలీజ్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!
అయితే, ఒక సమూహం లేదా ఓటర్‌ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది. అలాగే, ఓటర్లను బెదిరించే ఛాన్స్ కూడా ఉంది.. కాబట్టి, ఈ సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని తేల్చి చెప్పింది. అలా చేస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ వీడియోలు అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తాం.. ఎన్నికల కేసులో ఏదైనా న్యాయస్థానం కోరితే మాత్రమే ఆ కోర్టుకి ఈ వివరాలు అందజేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.