వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రూ. 12 వేలు ఇస్తున్నందుకు సంబరాలు చేయాలా..? రైతు భీమా, రుణ మాఫీ, పంటల బీమా చేయనందుకా, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా అని ప్రశ్నించారు.
Also Read:TTD: తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..
లగచర్ల, ధన్వాడ రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుకు సంబరాలు చేయాలా.. రైతులకు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నందుకు సంబరాలు చేయాలా.. ఇదేనా రైతులపై సీఎం రేవంత్ కి ఉన్న ప్రేమ..?.. మీకు నిజాయితీ ఉంటే ఎగ్గొట్టిన రైతు భరోసా ఇచ్చి సంబరాలు చేయండి.. కేసీఆర్ 11 సార్లు రైతు బంధు ఇస్తే ఎలాంటి ఉత్సవాలు చేయలేదు.. కేసీఆర్ నాట్లకు నాట్లకు రైతు బంధు వేస్తే ఓట్లకు ఓట్లకు రేవంత్ రైతు భరోసా ఇస్తున్నాడు.. ఈ రోజు గాంధీ భవన్ లో గొర్రెలు తీసుకుపోయి యాదవులు తమ నిరసన వ్యక్తం చేశారు.
Also Read:TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు అంతా సగం సగం ఆగమాగం.. ఇచ్చిన ట్రాక్టర్ లో డీజిల్ లేకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా..? సీఎం రేవంత్ పాలనని గాలికి వదిలేశాడు.. కేసీఆర్ ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి తెలంగాణ పల్లెలకు అనేక అవార్డులు వస్తే సీఎం రేవంత్ వచ్చాక గుండు సున్నా వచ్చాయి.. పరిపాలన అంటే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం కాదు ప్రజలకు సేవ చేయాలని హరీష్ రావు మండిపడ్డారు.