Minister Thummala: ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం కామంచికల్ రోడ్ కావాలని సత్యం కోరారు.. ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంది.
తెలంగాణలో గొల్లలు, కుర్మలు వేరని దుష్ప్రచారం చేశారని.. కానీ గొల్లలు, కుర్మలు ఒక్కటే అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గొల్ల, కుర్మల తరుపున తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. గొల్ల, కుర్మలు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ లేదని.. ఈసారి కూడా మంత్రి వర్గంలో గొల్ల, కుర్మలకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…
తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్ శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు.. అడ్లూరు లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయ్యారు. Also Read: Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు…
అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతుల (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను…
కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ…
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని…
తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయునా చెప్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. మూడు రోజులుగా…
విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము విత్తనాలు అందిస్తాం అని, రైతులు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు, పాడి పంటలతో తెలంగాణ దేశంలో అత్యధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్…