ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ వద్ద ఆధారలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లేదని గుర్తించారు. ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. డబ్బుల తరలింపు పై టాస్క్పోర్స్ టీమ్ కు ప్రణీత్ రావు సమాచారం ఇచ్చారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్ టిడిపి తరపున పోటీ చేశారు.
Also Read:Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రాధాకిషన్ రావు బృందం పట్టుకుంది. బేగంపేట పరిధిలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ప్రణీత్ రావు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు మునుగోడు ఎన్నికల సందర్భంలో పోలీస్, రెవెన్యూ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రణీత్ రావు పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు వెలుగు చూసింది.