ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.. ట్యాపింగ్ ఎలా చేస్తారు.. ఎప్పుడు చేశారనే విషయాలు బయటకు వస్తున్నాయి.. రివ్యూ కమిటీ కి చైర్మన్ గా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు జిఐడి పొలిటికల్ సెక్రటరీ స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.. మూడు ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు సిట్ తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి.. ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? ఎలా చేశారు? ఎవరు దీనికి బాధ్యులు అనేదానిమీద సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది.. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక సూత్రధారి అయిన ప్రణీత్ రావ్ ని 9 సార్లు విచారించింది..
Also Read:Rajnath Singh: ఆపరేషన్ సిందూర్‌తో అన్ని లక్ష్యాలు సాధించాం
అదే మాదిరిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఐదు సార్లు విచారించింది.. వీళ్ళ దగ్గర నుంచి విడివిడిగా ఇప్పటివరకు స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.. అయితే ఇద్దరిని కలిపి ఒకేసారి విచారించాలని సిట్ ఒక నిర్ణయానికి వచ్చింది.. ఎందుకంటే ఇద్దరు చెప్తున్న వాదనలు వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ప్రణీత్ లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ భావిస్తుంది.. ఇప్పటివరకు ఇద్దరు చెప్పిన స్టేట్‌మెంటును రికార్డు చేశారు.. అయితే ఇద్దరు వేరు వేరు తమ వాదనలు చెప్పుకుంటూ వచ్చారు ..ఈ వాదనలను బలం చేకూర్చేందుకు ఇద్దరిని కలిపి విచారించారని సిట్ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే రివ్యూ కమిటీ కీ ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది.
Also Read:Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
ఈ ఫోన్ నెంబర్లను ఎవరు తయారు చేశారు.. ఎవరు ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావుకి ఇచ్చారని విషయాన్ని తేల్చే పనిలో సిట్ ఉంది.. ముఖ్యంగా మావోయిస్టుల సానుభూతిపరులు అనుచరులు అంటూ వేల కొద్ది ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఇచ్చాడు.. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ఎలాంటి పరిశీలన చేయకుండా కేంద్ర టెలికం శాఖకు పంపించినట్లు భావిస్తుంది.. ఇందులో భాగంగా రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులను వరుసగా సిట్ విచారణ చేస్తుంది.. ఇందులో భాగంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారితో పాటు జిఐడి పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డ్ చేసింది..
Also Read:Vangalapudi Anitha: జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
రివ్యూ కమిటీ లో అసలు ఏం జరుగుతుంది.. ఎలా ఫోన్ నెంబర్లని కేంద్ర కమ్యూనికేషన్ శాఖకు పంపిస్తారు.. రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను వెరిఫై చేస్తారా.. లేదా ప్రతిసారి ఎన్ని ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఇచ్చాడు.. దీనిపైన చర్చ జరిగిందా ఎవరి ఫోన్ లు అని చెప్పి రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు ఇచ్చాడు అనే దానిమీద ప్రశ్నల పరంపరను కొనసాగించారు.. గత ప్రభుత్వ హయాంలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి ..హుజురాబాద్ మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికలు జరిగాయి.. ఈ ఉప ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను పెద్ద మొత్తంలో ట్యాపింగ్ చేసినట్లు బయటపడింది..
Also Read:Amaravati: అమరావతిలో భూ కేటాయింపులు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు..
అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.. కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న పోలీస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు ..ఎవరైనా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే వారిపైన బదలీ వేశారు.. 2018 సాధారణ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు బయటపడింది.. ఎందుకంటే ఆ సమయంలో ప్రతి పార్టీలో సంబంధించిన డబ్బులు పెద్ద ఎత్తున పట్టుకోవడం జరిగింది.. అది కూడా హైదరాబాద్ నుంచి రవాణా అవుతుంటే పట్టుకొని హవాలా డబ్బు అంటూ ఐటీ శాఖకు అప్పగించారు..
Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
ఎప్పటికప్పుడు డబ్బు రవాణా మీద దృష్టి పెట్టి ఆమెరకు సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ కి అందించాడు.. రాధా కిషన్ తన టీముని రంగంలోకి దించి ఆ డబ్బులు పట్టుకొని హైదరాబాద్ పోలీస్లకు అప్పగించేవాడు.. ఇలా 2018 ,2023 సాధారణ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని రాధాకృష్ణ పట్టుకోవడం జరిగింది.. సాధారణ ఎన్నికల్లో చాలామంది పార్టీలకు సంబంధించిన పై స్థాయి నుంచి కిందిస్థాయి నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు.. వాళ్లందర్నీ ఇప్పుడు సిట్ పిలిచి విచారణ చేపడుతోంది.