తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నాడు..
TG Cabinet Expansion: గత కొంత కాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు (జూన్ 8న) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది. ఇదే కాంగ్రెస్ పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్ర చాలా కీలకం.. కేసీఆర్ వెనుకాల ఉండి ఆ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారు.. మేడిగడ్డ బ్యారేజీలో…
ఓ వివాదంలో ఎస్సై కాంగ్రెస్ నాయకుడి చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో ఎస్సైపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ ఐ పై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ ఎస్ పి సెంటర్లో…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ వేసిన పిటిషన్ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్ , జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. Top Headlines @5PM : టాప్ న్యూస్ ఈ వివాదానికి నేపథ్యం ఇది – ఇటీవల కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 25…
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. ఒక పీడకలగా మారింది అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా పేర్కొన్నారు. ఒక వైపు, తొక్కిసలాట జరిగిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటే.. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాత్రం క్రికెటర్లతో కౌగిలింతలు, ఫోటోలు తీసుకోవడంతో చాలా బిజీగా ఉన్నారని ఆరోపించారు.
Allahabad High Court: 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. ఇంతకీ ఈ యువ ఎమ్మెల్యేకి ఏం కష్టమొచ్చింది. కన్నీరు పెట్టడానికి గల కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. Also…