త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
Rajnath Singh On Rahul Gandhi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి…
ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.