Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి విరమణ చేయడాన్ని ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు అని ఆమె అన్నారు. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిస్తుంది అని అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం మరియు సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూపించిందని అన్నారు.
Congress plenary : దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి, చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది.
త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
PM Narendra Modi: కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంగా ఉపయోగించుకుందని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. శుక్రవారం ఆయన నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాలను ‘‘ అష్ట లక్ష్మీ’’లుగా భావిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Congress Plenary Meetings: ఛత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరగనుంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి.
Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాను విమానం నుంచి దింపేసిన తర్వాత అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు బయలుదేరిన పవన్ ఖేరాను విమానం నుంచి దింపేశారు అధికారులు. పార్టీ నేతలతో కలిసి విమానం ఎక్కిన కొద్ది సేపటికే ఆయనను అధికారులు అడ్డగించారు. రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ఆయన…
Off The Record: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి. ప్రస్తుతం ఈ దంపతుల ఫొటోలతో వేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అసమర్దుల, అవినీతి పరుల చేతిలో బందీ అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల సంకెళ్లు తెంచాలని ఆ పోస్టర్లలో రాశారు. పూర్వవైభవం తెచ్చేందుకు మళ్లీ మీరు రావాలి అని రెండు సెగ్మెంట్లలో పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ల వెనుక మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందా? వాళ్ల…