దేశ వ్యాప్తంగా సంచలన ప్రచారం జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ సినిమా బీజేపీ పార్టీ సూపర్ గా తీసిందని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఢిల్లీలో జరిగిన డ్రామా ప్రపంచ వ్యాప్తంగా వింత నాటకంగా కనిపించిందన్నారు. లిక్కర్ ఫైల్స్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కేంద్ర మంత్రి అమిత్ షా అని ఆయన అన్నారు. మోడీ ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్న ముందు అక్కడికి ఈడీ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అదానీ 14 లక్షల కోట్ల అక్రమాలు కనుమరుగు అయ్యే విధంగా లిక్కర్ కేసును తెర మీదకు తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. లిక్కర్ కేసుకు సంబంధించి అన్ని ప్రసార మాధ్యమాలను బుల్లెట్ పాయింట్స్ కూడా ప్రభుత్వాలే వేశాయని ఆయన అన్నారు. రేవంత్ పాదయాత్రతో బీఆర్ఎస్ వేగవంతంగా పతనం అవుతోందని ఆయన తెలిపారు. ఆప్ బీఆర్ఎస్ పార్టీలు మోడీ వ్యతిరేకంగా పని చేస్తున్నాం అనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది ప్రభుత్వ పెద్దలు ఆడిన వింత నాటకమని, వైసీపీ, బీజేపీ, ఆప్, బీఆర్ఎస్ పార్టీలు అన్ని ఒక్కటే అని ఆయన ఆరోపించారు. 2009 ఆగస్ట్ 9 కేసీఆర్ పై పెట్టిన సీబీఐ కేసు ఇప్పటికి విచారణకు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న వచ్చిన లిక్కర్ స్కాం తెరమీదకు తెచ్చి అందరూ గెలిచే విధంగా ప్లాన్ చేశారని, సౌత్ గ్రూప్ ఢిల్లీలో ఏజెన్సీలకు బెన్ఫిట్ అయ్యే విధంగా చట్టం తీసుకొచ్చారన్నారు. బీఎల్ సంతోష్ కేసు నుంచి రక్షించారని, పవిత్ర రాజకీయాలు రామ రాజ్యం మధ్య నిషేధం చేస్తా అని చెప్పిన మోడీ.. ఈరోజు దేశ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోందన్నారు. సోనియా గాంధీని ఈడీ విచారణ సమయంలో మా నేతలను ఈడ్చుకెల్లి పోలీసు స్టేషన్‌లో వేశారు.. నిన్న కవిత విచారణలో అది కనిపించలేదన్నారు. ఈ కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఉందని, అవినీతి రాజకీయాలను ఊడ్చేస్త అని చీపురు పట్టిన కేజ్రీవాల్ నేడు తట్ట బుట్ట సద్దుకునే పరిస్థితి ఉందన్నారు.
Also Read : Viral Video: బహిరంగ ర్యాలీలో మహిళా నాయకురాలిని ముద్దు పెట్టుకున్న ఎమ్మెల్యే?