తెలంగాణ లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించారు ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో నేడు అతి పెద్ద సమస్య భూమి సమస్య అన్నారు. అది ధరణి వల్ల మరింత చిక్కుల్లో పడిందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండేందుకు పోరాటం చేస్తుందన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చూపేందుకు ధరణి అదాలత్ లు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేసిందని ఆయన తెలిపారు.
Also Read : Mithun Reddy vs Nara Lokesh: లోకేష్‌కి మిథున్‌రెడ్డి కౌంటర్.. చర్చకు రెడీ.. ప్లేస్ ఎక్కడో చెప్పు..
సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉండి పని చేస్తారన్నారు. మీ భూ హక్కులు మీరు తిరిగి కల్పించేందుకుకాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. పేదలకు కేసీర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని ఆయన అన్నారు. పేదల భూములు వారికి చెందేలా చేసే వరకు ధరణి అదాలత్ కార్యమాన్ని కొనసాగిస్తామన్నారు. రానున్న రోజుల్లో ధరణిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఠాక్రె తెలిపారు. తెలంగాణలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరణి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : CM KCR : రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం
అనంతరం.. జైరాం రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. మిగత పార్టీలతో పొత్తు విషయాలను పరిశీలిస్తామని, వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీ లతో పొత్తు ఉందన్నారు. వామపక్షాలతో వివిధ రాష్ట్రాలలో పొత్తు ఉందని ఆయన తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం ఉందని, మేము ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే వాళ్ల సమస్యలను పరిష్కారం చేస్తామని, ధరణి పోర్టల్ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం చూపిస్తామన్నారు.
Also Read : Youngest Yoga Instructor: ఏడేళ్ల వయస్సులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. యోగా శిక్షకురాలిగా..