Baby Monkey: ఇంటర్నెట్ స్టార్ బేబీ మంకీ “పంచ్” కోసం.. రూ. 2 కోట్ల ఆఫర్..
- ఇంటర్నెట్ స్టార్ బేబీ మంకీ "పంచ్"
- కొనడానికి రూ. 2 కోట్ల ఆఫర్
- ఇన్‌ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్, సోదరుడు ట్రిస్టన్ టేట్ X (ట్విట్టర్)లో పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్‌లోని ఇచికావా సిటీ జూ లో ఉన్న ఏడు నెలల బేబీ జపనీస్ మాకాక్ కోతి “పంచ్” ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి తిరస్కరించడంతో జూ సిబ్బంది దాన్ని పెంచారు. ఇతర కోతులు దాన్ని దగ్గరికి రానీయకపోవడంతో, పంచ్ ఒక స్టఫ్డ్ ఆరెంగుటాన్ బొమ్మను గట్టిగా పట్టుకుని ఓదార్పు పొందుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత వచ్చిన కొన్ని వీడియోల్లో పెద్ద కోతులు పంచ్‌ను లాగడం, కొట్టడం వంటి సీన్లు కనిపించడంతో నెటిజన్లు భారీగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోలు చూసిన ఇన్‌ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్, సోదరుడు ట్రిస్టన్ టేట్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. “ఈ కోతి ఏ జూలో ఉంది? నేను, @Cobratate (ఆండ్రూ టేట్) కలిసి దాన్ని కొనేస్తాం. $250,000 (సుమారు రూ. 2 కోట్లు). నేను జోక్ చేయడం లేదు” అని పోస్టు చేశారు. ఈ పోస్ట్ కొద్ది రోజుల్లోనే 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read:Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రిస్టన్ టేట్ బిడ్ వల్ల సోషల్ మీడియాలో భారీ డిబేట్ మొదలైంది.. కొందరు టేట్ బ్రదర్స్ దాన్ని రెస్క్యూ చేయాలని సపోర్ట్ చేశారు. మరికొందరు జూలోనే ఉంచి సరైన కేర్ ఇవ్వాలని, డబ్బుతో కొనడం సరికాదని అంటున్నారు. కొందరు జూకు డొనేషన్లు చేయాలని సూచిస్తున్నారు. ఇటీవలే ట్రాన్ జస్టిన్ సన్ (Justin Sun) కూడా ఈ జూకు $100,000 డొనేట్ చేశాడని వార్తలు వచ్చాయి. జూ ఇంకా టేట్ బ్రదర్స్ ఆఫర్‌పై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. పంచ్ ఇప్పుడు క్రమంగా ఇతర కోతులతో స్నేహం చేస్తోందని, హ్యాపీగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ క్యూట్ బేబీ మంకీ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హార్ట్స్‌ను టచ్ చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!