Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ యూకే కేంబ్రిడ్జ్ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా తనతో పాటు పలువురు రాజకీయ నేతలపై నిఘా పెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
Jeevan Reddy: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు.
Rahul Gandhi at Cambridge: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో పర్యటించినప్పుడు జరిగిన ఓ సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నారు. ఉగ్రవాద ప్రభావం ఉండటం వల్ల కాశ్మీర్ లో యాత్ర చేయొద్దని భద్రతా బలగాలు తనను కోరాయని, అయితే తాను మాత్రం యాత్రను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.
Anurag Thakur criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘాలో ఉన్నానని యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అనురాగ్ ఠాకూర్, రాహుల్ గాంధీ విమర్శలను శుక్రవారం తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాసం సందర్భంగా కేంద్రంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు.