హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం ఆదాయం పెరిగిందని, రైతు బంధు డబ్బులు బెల్ట్ షాపులకు వెళ్తున్నాయన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ఒక అగ్రిమెంట్‌గా భావిస్తున్నామన్నారు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఆయన వెల్లడించారు. పంటల బీమాను పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Militants Surrender: అరుణాచల్‌లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని, రైతులకు హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. పసుపు పంటకు 12 వేలు మొక్క జొన్న వారి పంటలకు 2500 మద్దతు ధర ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా అమలు చేయకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బతికుండగా ఆదుకోని సర్కారు చనిపోయాక రైతు బీమా ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ మోడల్ అంటే 3 వేల వైన్స్ షాపులు, 60 వేల బెల్ట్ షాపులు అంటూ ఆయన సెటైర్లు వేశారు.
Also Read : Pawan Kalyan: నేను మెత్తగా కన్పిస్తానేమో, కానీ మెత్తటి మనిషిని కాను.. పవన్ వార్నింగ్