Revanth Reddy : కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం కోరుట్లలో కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన కోరుట్ల కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావని, ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆర్‌ఎస్ చేసిందేం లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది.
Also Read : Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్‌పై అధిష్టానానిదే నిర్ణయం..!
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆర్‌ఎస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా? తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయిన దాంట్లో కేసీఆర్ వాటా ఎంత? 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నడు మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు. విద్యాసాగర్ రావు ఒక లెక్కనా? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాం. పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారు. ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది.
Also Read : Holi Incident: హోలీ సంఘటనపై జపాన్ మహిళ స్పందన.. దేశం వదిలివెళ్లిన తర్వాత ట్వీట్స్..
తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!