మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని... అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు.
Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka: మహిళా దినోత్సవం రోజు ఓ మహిళకు అవమానం ఎదురైంది. బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళను బహిరంగంగా తిట్టారు బీజేేపీ ఎంపీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీ తీరును, బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Rahul Gandhi: బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని కలలు కంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సోమవారం లండన్ లో జరిగి చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్లో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని గుర్తు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు.