ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది
విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Congress: వరసగా ఓటములు కాంగ్రెస్ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తర్వాత జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్కి గురిచేశాయి. మహారాష్ట్రలో అయితే, అత్యంత దారుణమైన రీతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పాలనను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వాంకిడిలో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక ఉద్యోగం ఇస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థిని మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు.
కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు.
Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది.
BJP: హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలే కారణమని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తిరస్కరించి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ ఓడిపోతే ఈవీఎంల గురించి ఏడుస్తారు.