Arvind Kejriwal: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఇతర మిత్ర పక్షాలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పార్లమెంట్లో కాంగ్రెస్ విధానంపై మండిపడుతోంది. సభని సరిగా జరగనివ్వాలని కోరుతోంది.
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు.
Congress: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్క్ చేరనీయ్యలేదని, తమకు ప్రతిపక్ష హోదా దక్కిందనే సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం నిలవలేదు. వరసగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, క్రెడిట్ అంతా జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) , సీఎం హేమంత్ సొరెన్కే దక్కింది. జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీకి చిన్న భాగస్వామిగా కాంగ్రెస్ మిగిలింది.
వయనాడ్ ప్రజల కోసం తన ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఎంపీగా గెలిచిన సందర్భంగా వయనాడ్లో ప్రియాంక కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
R.S. Praveen Kumar: నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.. కొండా సురేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. తాజాగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్ఎస్ కుట్రచేసి విషఆహారం తినిపిస్తున్నారని అన్నారు.
MLA Aadi Srinivas: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వాడు వీడు అంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.