ఇండియూ కూటమిలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా నాయకత్వ మార్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నియమించాలంటూ కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలు దాదాపుగా ఇదే డిమాండ్‌ను చేస్తున్నాయి. మిత్రపక్షాల డిమాండ్‌ను కాంగ్రెస్ మాత్రం తోసిపుచ్చుతోంది. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే మమత వలనే సాధ్యమవుతుందని ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు డిమాండ్ చేస్తు్న్నాయి. అయితే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బెంగాల్‌లలో మమత బీజేపీని ఓడించగలిగారు గానీ.. దేశ వ్యాప్తంగా ఆమె ప్రభావం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో అయోమయం గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Priest Suicide: కాళీ దేవీ దర్శనం ఇవ్వలేదని పూజారి ఆత్మహత్య..
ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడారు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు గురించి చర్చించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన నాయకత్వం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. వారంతా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని.. వారి పార్టీ కూడా బాగుండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే తనకు ఢిల్లీ కుర్చీపై ఆశలేదని.. కేవలం బీజేపీని ఓడించేందుకు ప్రత్యామ్నాయ వేదికగా ఉంటానని పేర్కొన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని.. కాబట్టి దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: AP SSC Exams 2025 Schedule: ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ పరీక్ష అంటే..?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో రాహుల్‌గాంధీ సారథ్యంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి తాను సమర్థంగా సారథ్యం వహిస్తానని ఇప్పటికే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆర్జేడీ, సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్) నేతలు మద్దతు తెలుపుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మమత నాయకత్వంలో ప్రతిపక్ష కూటమి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బెంగాల్‌లో బీజేపీని ఓడిస్తూ.. అధికారం చేపడుతున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ అని కొనియాడారు.
ఇది కూడా చదవండి: Taliban Minister Killed: కాబూల్‌లో భారీ పేలుడు.. తాలిబన్ మంత్రి మృతి