M Jethamalani: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఈ అసోసియేషన్ భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ ఆరోపించింది. భారత్‌లో మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు, భారత్ ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు అమెరికన్ డీప్‌స్టేట్ కుట్రలు చేస్తోందని, వీటిలో కీలకంగా ఉన్న జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది.
Read Also: ICC Test Rankings: అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
ఇదిలా ఉంటే, సీనియర్ లాయర్ మహేష్ జఠ్మలానీ సోనియాగాంధీ, జార్జ్ సోరోస్ సంబంధాలపై ధ్వజమెత్తారు. సోరోస్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చబడిని ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్(ఆసియా పసిఫిక్) ఫోరమ్‌కి సోనియా గాంధీ కో ప్రెసిడెంట్‌గా ఉండటం వీరిద్దరి మధ్య ‘‘ అపవిత్ర బంధం’’గా అభివర్ణించారు. యాంటీ టెర్రర్ చట్టాల కింద సోనియాగాంధీపై దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, జెఠ్మలానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు.
మరోవైపు సోమవారం బీజేపీ ఆరోపణలకు ధీటుగా స్పందించింది. ‘‘మేం దేశభక్తులం. భారత వ్యతిరేక వైఖరిని ప్రస్తావించే ప్రశ్నే లేదు’’ అని చెప్పింది. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..సోరోస్‌తో లింక్స్ హాస్యాస్పదమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేస్తు్న్న తరుణంలో బీజేపీ నుంచి సోరోస్ లింకుల గురించి ఆరోపణలు వచ్చాయి.
#SoniaGandhi’s co-presidency of the Forum of Democratic Leaders – Asia Pacific (FDL-AP) not only establishes her links with #GeorgeSoros, as the Forum is heavily financed by the George Soros Foundation, but also exposes her to grave criminal charges under the #UAPA in view of the…
— Mahesh Jethmalani (@JethmalaniM) December 11, 2024