మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసీ డెవలప్మెంట్ పైన పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తాము.. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నామని రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి చెప్పారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిందని హరీష్ రావు ఆరోపించారు.
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్సభ బైపోల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు పండుగను నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల రైతులు ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
ఈమధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేరళలో, జార్ఖండ్ మంచి మెజారిటీ... మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ వయనాడ్లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది.