ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శరద్‌పవార్‌తో,గాంధీ కుటుంబంతో జరుపుతున్న మంతనాలు,ప్రతిపక్ష నేతల సమావేశం,రేపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢల్లీి పర్యటన వంటి అంశాలు ఇప్పుడుమీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఒక అభిప్రాయం. అందుకు సంబంధించిన సంప్రదింపులలో కాంగ్రెస్ మొదట పాల్గొనకపోవడంపై వ్యాఖ్యలు వచ్చాక ఆయన నేరుగా సోనియా రాహుల్ తదితరులతో చర్చలు జరిపివచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీఏకంగా రంగ ప్రవేశం చేశారు. ఈ పూర్వరంగంలోనే ప్రశాంత్ కిశోర్ బిబిసితో తన అభిప్రాయాల గురించి వివరంగా మాట్లాడారు.వాటిని బట్టి చూస్తే బయిట జరిగే ప్రచారానికి ఆయన అనుకుంటున్న దానికి సంబంధం లేదనిపిస్తుంది. బిజెపికి వ్యతిరేకంగా ఏదైనా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం కుదిరేపని కాదని పికె గట్టిగా భావిస్తున్నారు అలాగే అతుకుల బొంత లాటి ప్రతిపక్ష ఐక్యత సాధ్యమయ్యేడి కాదని కూడా ఆయనమాట.
కాంగ్రెస్ వేగంగా బలహీనపడిపోయిందిన 2019లో కేవలం 20శాతం ఓట్లకు, 50 సీట్లకు పరిమితమైందని అంటూనే దాన్ని ఎలాబాగుచేయాలో చెప్పడం తనపని కాదంటారు.అలాఅని బిజెపికితిరుగులేదా అంటే అదీ ఒప్పుకోడంలేదు.దేశంలో200లోక్‌సభ స్థానాలున్న దక్షిణాదిలో, తూర్పుభారత్‌లోబిజెపి నలభైకూడా తెచ్చుకోలేకపోయింది.340 స్థానాలున్న ఉత్తరాదిలోనే దానికి అత్యధిక స్థానాలు వచ్చాయి. మరి ఈ 200 స్థానాలలో ప్రతిపక్షాలు కలసి వ్యవహరించి150పైన పొందగలిగితే బిజెపినిబలంగాసవాలుచేయడం సాధ్యమేనంటారు. దేశంలో ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి ఏడుసార్లు ఘనవిజయాలు అందించిన పికె అందుకు పెద్దవ్యూహాలు ఏమీ అనుసరిబచడం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, సాధికారత కల్పించడం, సమస్యలపై వారి ఫిర్యాదులు వినడం ఇదే విజయానికి దారితీస్తుంటుంది.
డ్రైనేజీ సమస్యల వంటివి పరిష్కరించడం చాలాసార్లు కీలక ప్రభావం చూపిస్తుందంటారు. పశ్చిమ బెంగాల్‌లో మొన్నటి ఎన్నికల్లో తృణమూల్ తరపున పనిచేసిన పికె ఒక ప్రజల ఫిర్యాదులు వినేందుకు ఒక హెల్ప్‌లైన్‌ఏర్పాటు చేస్తే 70 లక్షల ఫోన్లు వచ్చాయట.వీటిలో అధికభాగం స్థానిక సమస్యలు, కుట సర్టిఫికెట్ల జారీలో జాప్యం వంటవాటిగురించే కావడం విశేషం.ఆ డెబ్బతో ఆరువారాలలో 26లక్షల సర్టిఫికెట్లు అందేలాచేశారట. బహిరంగ సభలూభారీ సమీకరణలూ ఎన్నికల విజయాలకు పెద్దగాదోహదం చేసేది లేదని ఆయన చెబుతారు.ఓటర్ల గురించి తానెప్పుడూ మరో వూహ చేయనని, వారి నుంచి రాబట్టే కొత్త సమాచారం కొత్త ఐడియాలు ఇస్తుందని అంటారు పికె. ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించడం బాగా సంపన్నులైన వారికే సాధ్యమవుతుందని తన అంచనా. తన వరకూ వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా రాజకీయాలపై పెద్ద ఆసక్తిలేదని, ఇప్పుడు నిర్వహించే బాధ్యతల తర్వాత ఏం చేస్తానో చెప్పలేనని దాటవేస్తున్నారు.అయితేదేశంలో ఆయన కార్యకలాపాలు చూసేవారు మాత్రం వాటిని పెద్దగా విశ్వసించడం లేదు.