1981 ఏప్రిల్ 20వ తేదీన జల్.. జంగల్.. జమీన్.. కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటన 40 ఏళ్లు పూర్తిచేసుకుంది.. అయితే, ఇప్పుడు ఇంద్రవెల్లి దండోరాతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మోసాన్ని ఎండగతాం అంటోంది.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… దీనిపై పలురకాలర విమర్శలు వినిపిస్తున్నాయి.. వీటిపై ఎన్టీవీతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి.. అప్పటిఅధికారుల వల్లనే ఇంద్రవెల్లిలో కాల్పుల జరిగాయన్నారు.. 1981లో పొరపాటే జరిగిందన్న ఆయన.. కానీ, ఆదివాసీలను మేం గౌరవిస్తాం అని స్పష్టం చేశారు.
దళిత, గిరిజనులను ఏడున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు మల్లు రవి… దళితులకు మూడెకరాల భూమిఎక్కడా..? అని ప్రశ్నించిన ఆయన.. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే ఇప్పుడు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఉద్యమ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనం ముందుకొచ్చింది.. మాది ప్రజలపార్టీ అన్న ఆయన.. ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయపార్టీగా మారిపోయిందన్నారు.. ఇంద్రవెల్లి దండోరాతో ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామని ప్రకటించారు మల్లు రవి.