కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హాట్ కామెంట్లు చేసిన కాక రేపిన ఆయన.. ఆ తర్వాత కాస్త సైలెంట్‌గానే ఉన్నారు.. అయితే, పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్లు చేసి.. ఆ తర్వాత ఇక పొలిటికల్ కామెంట్లు చేయనని ప్రకటించారు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో, పలు గ్రామాలలో శంకుస్థాపన, అభివృద్ధి పనులు…
ఆయనకు ఆశ పెట్టారు. ఆ ఆశను మొగ్గలోనే తుంచేశారు. నిద్రలేపి.. సినిమా చూపించారు. వాస్తవానికి… ‘నాకు ఇది కావాలి..!’ అని ఆయన అడిగింది లేదు. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారట ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏంటా ఆశ? ఇంకా గాంధీభవన్ మెట్లెక్కని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే KLR, తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.…
హుజురాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీనియర్ నేతకు ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. దుబ్బాక ఉపఎన్నికలోనూ ఆయనే పార్టీ ఇంచార్జ్. దీంతో ఆ నేతకు ఇది పరీక్షా కాలమా.. ఇంకేదైనా వ్యూహం ఉందా అని చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు చావో రేవా? తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఉపఎన్నికలేవీ కాంగ్రెస్ పార్టీకి కలిసి రాలేదు. సిట్టింగ్ స్థానాలనే కోల్పోయిన పరిస్థితి. అధికారపార్టీ ముందు పేలవమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. నాయకత్వం లోపమని…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ… సోనియాను ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఆయనే గతంలో సోనియాను బలి దేవత అన్నారని వ్యాఖ్యానించారు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. టీడీపీ పాత వాసనలు ఇంకా పోలేదని.. టీపీసీసీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కామెంట్ చేశారు.. నోట్ల…
తెలంగాణ పీసీసీ కార్యరంగంలోకి దిగబోతోంది. కొత్త టీమ్‌తో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ సమావేశం కానున్నారు. రోజంతా పార్టీ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పీసీసీ కొత్త టీమ్ ఎంపిక పూర్తయిపోవడంతో… కార్యాచరణ మొదలెట్టింది. ఇప్పటికే పార్టీ చాలా నష్టం జరిగిందనీ… ఇకపై యాక్షన్‌లోకి దిగాలని…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఫస్ట్ రోజే ఆయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.. గాంధీ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. సీఎం రేవంత్ అని నినాదాలు చేశారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆ నినాదాలపై సీరియస్ అయ్యారు రేవంత్.. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అంటే పార్టీలో ఉండరు.. పార్టీ నుండి బయటకు పంపుతాం.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం అని స్పష్టం చేశారు.. నన్ను అభిమానించే…
గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… అనేక విషయాలను ప్రస్తావించారు.. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించారు..…